- Advertisement -
- సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలి
నవతెలంగాణ – కోహెడ
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ హైమావతి అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల అటెండెన్స్ రిజిస్టర్, ఇన్ పేషంట్ రిజిస్టర్, ఆరోగ్య మహిళ వ్యాక్సినేషన్ తదితర రిజిష్టర్‌లను పరిశీలించారు. అటెండెన్స్ రిజిష్టర్‌లో ఎలాంటి లీవ్ సాంక్షన్ లేకుండా గైర్హాజరైన సిబ్బంది విజయ, సతీష్‌కుమార్‌లపై చర్యలు తీసుకోవాలని అలాగే మెడికల్ లీవ్‌లో ఉన్న ఆయుష్ డాక్టర్ కిరణ్‌కుమారి, లద్నూర్ హిహెచ్‌సీ నుండి డిప్యూటేషన్‌పై వచ్చిన నర్సింగ్ స్టాఫ్ పూజ డిప్యూటేషన్ రద్దు చేసిన తిరిగి వెళ్ళకుండా ఇక్కడే విధులు నిర్వహిస్తున్నందున తగు చర్య తీసుకోవాలంటూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి సూచించారు. అలాగే వర్షకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అవుట్ పేషంట్ రిజిష్టర్ కచ్చితంగా వాడాలని, మందుల కొరత లేకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహాశీల్దార్ సమీర్ అహ్మద్‌ఖాన్, ఎంపీడీవో కృష్ణయ్య, స్టాఫ్ నర్స్ సృజన, తదితరులు ఉన్నారు.
- Advertisement -