పాలకుర్తి, వల్మిడి ఆలయాల్లో ఎమ్మెల్యే దంపతుల పూజలు
నవతెలంగాణ – పాలకుర్తి
ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శనివారం మండల కేంద్రంలో గల శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మండలంలోని వల్మీడీలో గల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దంపతులు కుటుంబ సమేతంగా అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. పాలకుర్తి మండలంలోని ఆలయాలకు ప్రత్యేక చరిత్ర ఉందని అన్నారు. పర్యాటక కేంద్రాలుగా మరింత అభివృద్ధి చెందేందుకు తోడ్పాటునందిస్తానని తెలిపారు. ఎమ్మెల్యే దంపతులకు కుటుంబ సభ్యులకు ఆయా ఆలయాల అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు.
ఆలయాల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES