నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
నగరంలోని స్థానిక రోటరీ నగర్ నందు గల హోవార్డ్ పాఠశాలలో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహించినట్టు ప్రధానోపాధ్యాయులు రత్న తేజ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల సంస్థల ప్రిన్సిపల్ డాక్టర్ టి ఎస్ శశికళ మాట్లాడుతూ ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు వైఫల్యం ఎప్పుడు శాశ్వతం కాదు ఒకసారి చిన్న ప్రయత్నం కూడా పెద్ద విజయాలను అందిస్తుంది అని గీత సారాంశం నుండి సందర్శకులతో పంచుకున్నారు. కృష్ణాష్టమి పురస్కరించుకొని శ్రీకృష్ణుని ,బాలకృష్ణుని, గోపికల వేషధారణలో చిన్నారులు వేదికనీ రంగు రంగుల వస్త్రధారణతో అద్భుతమయంగా చూపులను ఆకట్టుకున్నారు. అనంతరం విద్యార్థులు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ టివిఆర్ మూర్తి విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకు స్వతంత్ర సమరయోధులు ఇతర వేషధారణలో పంపుతున్నందుకు వారి సహకారాలకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు
హోవర్డ్ లో కృష్ణాష్టమి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES