ఉత్సాహంగా పాల్గొన్న నవతెలంగాణ విలేకరులు సిబ్బంది
నవతెలంగాణ- కంటేశ్వర్/నిజామాబాద్ సిటీ
నవతెలంగాణ దినపత్రిక 10వ వార్షికోత్సవం పురస్కరించుకొని దశాబ్ది వేడుకల్లో భాగంగా నిర్వహించిన క్రీడా పోటీలు అలరించాయి. శనివారం నగరంలోని ఆఫీసర్స్ క్లబ్ లో నిర్వహించిన వివిధ పోటీలలో విలేకరులు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. క్యారం బోర్డ్, షటిల్ పోటీలను సిపిఐ ఎం రాష్ట్ర కమిటీ నాయకులు బుర్రి ప్రసాద్ ప్రారంభించగా చెస్ పోటీలను పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు ప్రారంభించారు. క్రీడా స్ఫూర్తిని చాటుతూ ఆహ్లాదకర వాతావరణం లో ఉత్సాహంగా పోటీపడ్డారు. చెస్ పోటీలలో పోతంగల్ విలేఖరి లక్ష్మణ్ విజేతగా నిలవగా.. సిరికొండ విలేకరి గణేష్ రన్నరప్ గా నిలిచారు. బ్యాడ్మింటన్ పోటీలలో భిక్కనూర్ విలేఖరి శ్యాంసుందర్ గెలుపొందగా, టౌన్ రిపోర్టర్ రాజు రన్నరప్ గా నిలిచారు. క్యారం బోర్డ్ పోటీలలో మేనేజర్ సురేష్ ధర్పల్లి విలేకరి అజ్మత్ టీం గెలుపొందగా టౌన్ విలేకరి రాజు పోతంగల్ విలేకరి లక్ష్మణ్ రన్నరప్ గా నిలిచారు. ఈ కార్యక్రమాలలో ఉమ్మడి జిల్లా మేనేజర్ సురేష్ కృష్ణ స్టాపర్ మధు డివిజన్ ఇంచార్జి లు గోపి నవీన్ విలేకరులు రాజు ప్రవీణ్ లక్ష్మణ్ గణేష్ అజ్మత్, శ్యాంసుందర్, కరుణాకర్ యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు
ఉల్లాసంగా క్రీడా పోటీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES