నవతెలంగాణ – కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం లోని దేవరాంపల్లి లో శనివారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భముగా శ్రీ కృష్ణుడికి ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం ఉట్టి కొట్టె కార్యక్రమం ప్రారంభించారు.పెద్దలు, మాట్లాడుతూ… సంప్రదాయ పద్దతులను విద్యార్థులకు పరిచియం చేయడం వంటి విలువలను తెలపడం ప్రస్థుత పరిస్థితుల్లో ముఖ్యమని అన్నారు. ఉట్టి కొట్టి అనంతరం నగదు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కాటారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ పిల్లమరి రమేష్ రేగులాగూడెం మాజీ సర్పంచులు రాహుల్ రెడ్డి, నవీన్ రావు,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ఓన్న వంశవర్ధన్ రావు, కొండపర్తి మురహరి, కామిడి ప్రమోద్, గ్రామ పెద్దలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు
ఘనంగా కృష్ణాష్టమి జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES