- Advertisement -
- – సీపీఐ(ఎం) చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ
నవతెలంగాణ- చండూర్ - మండలంలోని నేర్మట గ్రామం నుండి బంగారిగడ్డ కు పోయే రహదారిని బీటీ రోడ్డుగా మార్చాలని సీపీఐ(ఎం) చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. ఆదివారం చండూరు మండల పరిధిలోని నేర్మట గ్రామంలో ఇంటింటికి సిపిఎం కార్యక్రమంలో భాగంగా సిపిఎం సర్వే బృందంనేర్మట నుండి బంగారిగడ్డకు పోయే రహదారిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రహదారి వెంట నడవాలంటే ప్రజలకు, రైతులకు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
- వర్షం వస్తే ఈ రోడ్డు బురద మయంగా మారుతుందని, రైతులు వ్యవసాయ భూముల దగ్గరికి వెళ్లాలంటే ఎప్పుడూ ఏమవుతుందోనని భయభ్రాంతులకు గురవుతున్నారని ఆయన అన్నారు. గతంలో ఈ గ్రామంలో కొన్ని సిసి రోడ్లు వేసిన కూడా ఆ రోడ్లు గుంతల మయంగా మారాయని, అదేవిధంగా మురికి కాల్వలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఈ గ్రాములో ప్రధాన రహదారి వెంట కుక్కలు సైర్య వివారం చేస్తున్న అధికారులు పట్టించుకోవడంలేదని ఆయన అన్నారు. ఈ గ్రామం నుండి పుల్లెంల, లెంకలపల్లి, గొల్లగూడెం, బంగారుగడ్డ రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయని, వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- ఈ గ్రామానికి గతంలో ఆర్టీసీ వారు ఉదయం 7 గంటలకు నల్లగొండకు పోయే విధంగా, మళ్లీ సాయంత్రం ఏడు గంటలకు ఈ గ్రామానికి విద్యార్థుల కోసం బస్సు సౌకర్యం కల్పించారు, కానీ అనివార్య కారణాల వలన ఆర్టీసీ బస్సును బంద్ చేయడంతో విద్యార్థులకు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఈ గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని, లేనియెడల సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలకు సిద్ధమవుతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నారపాక శంకర్, ఈరటి వెంకటయ్య,బల్లెం స్వామి, బొమ్మరగోని యాదయ్య, కొత్తపల్లి వెంకన్న, గ్రామ ప్రజలు బొడ్డుపల్లి నరసింహ, బొడ్డుపల్లి లింగయ్య, బండమీది లక్ష్మయ్య, వట్టిపల్లి నరసింహ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -