Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఘనంగా వైద్య గర్జన ఆత్మీయ సమ్మేళనం...

ఘనంగా వైద్య గర్జన ఆత్మీయ సమ్మేళనం…

- Advertisement -

నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఉస్మానియా మెడికల్ కాలేజీ 2005 బ్యాచ్ కు చెందిన వైద్య విద్యార్థులు  యావత్తు తెలంగాణ వైద్యులను, వైద్య విద్యార్థులను వైద్య సిబ్బంది అందరినీ కూడగట్టి 2010 సంవత్సరంలో వైద్య గర్జన ద్వారా తెలంగాణ వైద్య సమాజాన్ని  చైతన్యపరిచి  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై చేసిన పోరాటం అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించింది. 

ఆ వైద్య గర్జన ను పురస్కరించుకొని  కోఠి లోని ఉస్మానియా వైద్య కళాశాల ఆడిటోరియంలో డాక్టర్ దుర్గా కిరణ్ ఆధ్వర్యంలో వైద్య గర్జన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెడికల్ జేఏసీ చైర్మన్ డాక్టర్ బొంగు రమేష్ ,టిపిహెచ్డీఏ  రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కత్తి జనార్ధన్  హాజరయ్యారు.2010 సంవత్సరంలో ఉస్మానియా మెడికల్ కాలేజీలో జరిగిన వైద్య గర్జన సభ నాయకులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు ఆరోజు జరిగిన పరిస్థితులు, ఉద్విగ్న క్షణాలను నెమరు వేసుకుని నాయకులు భావోద్వేగానికి లోనయ్యారు.డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ.. వైద్య గర్జన గురించి చరిత్రలో లేకుండా చేశారని, చరిత్రని గుర్తుకు చేసుకోవడానికి, ఆస్ఫూర్తిని ముందుకు కొనసాగించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలియజేశారు.

డాక్టర్ బొంగు రమేష్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాధనలో వైద్యుల పాత్ర వెళలేనిది అని తమ విధులకు ఆటంకం కలిగించుకుండానే రాష్ట్ర సాధన పోరాటాలను ఉదృతం చేశారని రాష్ట్ర పునర్నిర్మాణంలో కూడా అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థులు , పూర్వ ఉద్యమ నాయకులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad