- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. వచ్చే నెల 30లోపు ఎన్నికల నిర్వహణ సాధ్యం కాకపోతే.. కోర్టును మరింత సమయం కావాలని కోరే ఆలోచనలో సీఎం రేవంత్ ఉన్నట్లు తెలిపారు. త్వరలో జరిగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ(PAC) భేటీలో ఎన్నికలపై స్పష్టత రానుందన్నారు. పార్టీపరంగా రిజర్వేషన్ల కల్పన, ఆర్డినెన్స్ ద్వారా ఎన్నికలకు వెళ్లే అంశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు.
- Advertisement -