నవతెలంగాణ – హైదరాబాద్: ఆసియా కప్ 2025 సెలక్షన్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. కొన్ని రోజులుగా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఉన్న భారత క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫిట్‌నెస్ సాధించాడు. ఈసారి టీ20 ఫార్మాట్‌లో టోర్నీ జరగనుంది. దీంతో సూర్యకుమార్ సారథ్యంలో భారత్ బరిలోకి దిగనుంది. కానీ అతడి ఫిట్‌నెస్‌పై ఇటీవల సందేహాలు తలెత్తాయి.
తాజాగా నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షల్లో అతడు పాస్ అయ్యాడు.ఐపీఎల్ 2025 తర్వాత సూర్యకుమార్ యాదవ్‌కు జర్మనీలో హెర్నియా శస్త్రచికిత్స జరిగింది. బీసీసీఐ రూల్స్ ప్రకారం.. ఎవరైనా క్రికెటర్ శస్త్రచికిత్స చేయించుకుంటే.. అతడిని మళ్లీ జట్టులోకి తీసుకునేముందు ఫిట్‌నెస్ టెస్ట్ పాస్ కావాల్సి ఉంటుంది. పాస్ కాకపోతే జట్టులో చోటు దక్కదు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీవోఈ)లో నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్ట్‌లో సూర్యకుమార్ యాదవ్ పాస్ అయ్యాడు. దీంతో ఆసియాకప్‌లో అతడు ఆడేందుకు లైన్ క్లియర్ అయింది.