- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలపై ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం సమీక్ష నిర్వహించారు. జిల్లా అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెన్ గంగా ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున ముంపు ప్రాంతాల్లోపై ఫోకస్ పెట్టాలని, వరద ప్రభావిత మండలాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. అధికారులు అందరూ అందుబాటులో ఉండాని సూచించారు.
- Advertisement -