- Advertisement -
నవతెలంగాణ- ఆత్మకూరు
ఆత్మకూరు పట్టణంలో శనివారం రాత్రి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు యాదవ సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి చెన్నకేశవ స్వామి దేవాలయం వరకు శ్రీకృష్ణుడు గోపికలతో చిన్నారుల వేషధారణలతో ఊరేగింపు నిర్వహించడం జరిగింది. కేశవ స్వామి దేవాలయం దగ్గర ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాలయం నందు బంగారు భాస్కర్ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు, పట్టణ ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -