Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వరంగల్ సభ పోస్టర్ ఆవిష్కరణ..

వరంగల్ సభ పోస్టర్ ఆవిష్కరణ..

- Advertisement -

కార్పొరేట్ కంపెనీల కోసం ఆదివాసులను హత్య చేస్తున్నారు..
కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర నాయకులు లక్ష్మీనారాయణ..
నవతెలంగాణ – అచ్చంపేట

ఈ నెల 24-08-2025 ఆదివారం అంబేడ్కర్ భవన్ వరంగల్ లో జరుగబోయే ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక భహిరంగ సభకు సంబందించిన వాల్ పోస్టర్ ను ప్రజాసంఘాల నాయకులు, ఆయా రాజకీయ పార్టీల బాధ్యులు, దళిత, కుల సంఘాలు, ఉపాద్యాయ, విద్యార్థి, మహిళా, అంబేద్కర్ యువజన సంఘాల ప్రతినిధులు అందరు కలిసి పట్టణం లోని అమర వీరుల స్థూపం దగ్గర విడుదల చేశారు. ఈ సందర్భంగా కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర నాయకులు లక్ష్మీనారాయణ మాట్లాడారు. మద్య భారతంలో ఆదివాసీలను, రెండున్నర దశాబ్దాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పోరేట్ల కంపెనీల కోసం వెటాడుతూ.. హత్య చేస్తున్నారని ఆరోపించారు. కోట్లాది రూపాయల విలువైన ఖనిజ సంపదను ఆదానీ,  అంబానీలకు అప్పగించడం కోసం కేంద్రం  తీవ్రంగా ప్రయత్నిస్తుందన్నారు.

ఆదివాసీ ఉద్యమాలు బలంగా కొన సాగుతున్న నేపథ్యంలో సల్వా -జుడుము, గ్రీన్ హంట్ సమాదాన్ ప్రహార్ ఆపరేషన్లతో   జనవరి 01, 2024 నుండి ఆపరేషన్ కగార్ పేరుతో పాశవికమైన హత్యాకాండను కొనసా గిస్తూ.. 70 ఎన్ కౌంటర్లలో 600లకు పైగా ఆదివాసీలను, ఉద్యమ కారులను హత్య చేశారని అన్నారు. ఇది చాలదన్నట్లు ఇంకా దారుణ మారణ కాండను కొనసాగిస్తూ 2026 మార్చి 31 వరకు మావోయిస్టు రహిత భారత్ ను నిర్మిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి  ప్రగల్బాలు పలుకుతున్నాడన్నారు.

 దీనిని నిరసిస్తూ..ఆదివాసీ హక్కుల పోరాట సంఘీబావ వేదిక ఆధ్యర్యంలో వరంగల్ లో పెద్ద ఎత్తున జరుగబోయే భహిరంగ సభను జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ బహిరంగ సభకు  సి ఎల్ సి  తెలంగాణ రాష్ట్ర ఆధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ అధ్యక్షత వహిస్తారు.ఈ సభకు వక్తలుగా టి పి సి సి   రాష్ట్ర అద్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రొఫెసర్ హరగోపాల్, సిపిఐ ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ , ఆదివాసీ సామాజిక కార్యకర్త అయిన సోనీ సోరి,  ప్రతినిధులు పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు.

ఈ వాల్ పోస్టల్ విడుదల కార్యక్రమంలో సి ఎల్ సి  ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి జక్క బాలయ్య, టీపీఎఫ్ రాష్ట్రకో కన్వీనర్  అంబన్న, బియ్యని శ్రీశైలం,   జిల్లా కో-కన్వీనర్ పర్వతాలు ,నల్లమల కళాకారులు జక్క గోపాల్,  టి ఎన్ వి ఎఫ్ కన్వీనర్ గోరటి అనిల్ కుమార్,  మాజీ ఎంపీపీ శ్రీనివాస్, నాయకులు కుంద మళ్ళిఖార్జున్, సుధాకర్, కాశన్న యాదవ్, మైనార్టీ నాయకులు మహబూబ్ అలీ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad