నవతెలంగాణ – హైదరాబాద్: బీహార్ ఓటర్ల జాబితా సవరణలో ‘ఓట్ల చోరీ’ జరిగిందంటూ వస్తున్న ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఇచ్చిన వివరణను ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. ఈసీఐ వివరణ ఏమాత్రం సంతృప్తికరంగా లేదని, వారి వ్యాఖ్యలు నవ్వు తెప్పించేలా ఉన్నాయని ఎద్దేవా చేసింది. ఎన్నికల సంఘం అసమర్థత, పక్షపాత వైఖరితో పూర్తిగా బట్టబయలైందని ఆరోపిస్తూ దాడిని మరింత ఉధృతం చేసింది. నేడు ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు.
బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నిష్పక్షపాతంగా జరిగిందని, రాజ్యాంగబద్ధంగా పని చేశామని స్పష్టం చేశారు. ముసాయిదా జాబితాలపై అభ్యంతరాలు తెలిపేందుకు ఇంకా 15 రోజుల సమయం ఉందని, రాజకీయ పార్టీలు తమ ఫిర్యాదులను సమర్పించవచ్చని తెలిపారు. తమను ఎవరూ భయపెట్టలేరని ఆయన వ్యాఖ్యానించారు.
సీఈసీ ప్రెస్ మీట్ ముగిసిన కొద్ది నిమిషాల్లోనే కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్ జైరాం రమేశ్ సోషల్ మీడియా వేదికగా ఎదురుదాడికి దిగారు. “లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన సూటి ప్రశ్నలకు సీఈసీ అర్థవంతంగా సమాధానం ఇవ్వలేదు. ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి” అని విమర్శించారు. అధికారికంగా కాకుండా వర్గాల ద్వారా సమాచారం లీక్ చేసే ఈసీ, ఇప్పుడు నేరుగా మాట్లాడటం ఇదే మొదటిసారని ఆయన చురక అంటించారు.
Jairam Ramesh: ఈసీ వివరణ హాస్యాస్పదంగా ఉంది: జైరాం రమేశ్
- Advertisement -
- Advertisement -