Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్ముంపు ప్రాంతాలను సందర్శించిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్..

ముంపు ప్రాంతాలను సందర్శించిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్..

- Advertisement -

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హితవు..
నవతెలంగాణ – జన్నారం

జన్నారం మండలంలోని పొన్కల్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని జువ్వి గుడా, మండలంలోని రోటి గూడ ముంపు ప్రాంతాలను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ పరిశీలించారు. పోలీస్ స్టేషన్ సమీపాన ఉన్న వాగు  ఉప్పొంగినప్పుడు, బుడగ జంగాల కాలనీలో  ప్రతిసారి నీళ్లు చేరడం బాధాకరమన్నారు. సమస్యను పరిష్కరించడానికి వాగు ఓడ్డు పక్కనే ఉన్న ఇళ్లను తొలగించి వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కాలనీలో సక్రమంగా నీరు రావడంలేదని కాలనీవాసులు ఎమ్మెల్యే బొచ్చు పటేల్ కు విన్నవించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే మంచినీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

కాలనీలో రోడ్డు వేయిస్తామన్నారు. కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుంది. అనంతరం రోటి గూడ గ్రామంలో ఉన్న ముంపు ప్రాంతాన్ని పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ పసియుల్లా మండల అధ్యక్ష కార్యదర్శులు ముజాఫర్ అలీ ఖాన్ మేకల మాణిక్యం, పిఎసిఎస్ చైర్మన్ అల్లం రవి   నాయకులు గుర్రం మోహన్ రెడ్డి సుభాష్ రెడ్డి మామిడిపల్లి ఇందయ్య దుమల రమేష్ ప్రశాంత్ ప్రవీణ్,  ఇసాక్, అజారుద్దీన్, దాముఖ కరుణాకర్, దుర్గం గంగాధర్, రాజన్న గంగన్న తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad