Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeమానవిఇలా నివారిద్దాం..

ఇలా నివారిద్దాం..

- Advertisement -

చుండ్రు సమస్య బాగా చికాకు పెడుతుంది. ఎన్ని చిట్కాలు పాటించినా ఒకపట్టాన వదలదు. పైగా ఈ సమస్య వల్ల కొందరిలో ఏకాగ్రత దెబ్బతింటుంది. అయితే, ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఖరీదైన మందులు, రసాయనాలు కొనాల్సిన అవసరం లేదు. వంటింట్లో దొరికే ఆహార పదార్థాలతోనే నయం చేసుకోవచ్చు.
రాత్రి మెంతుల్ని నీటిలో నానబెట్టి, ఉద యాన్నే మెత్తగా రుబ్బుకోవాలి. ఆ మిశ్ర మాన్ని తలకు పట్టించాలి. ఓ గంటసేపు ఆగి తరువాత షాంపూతో తలంటుకోవాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు తగ్గడమే కాకుండా మాడు కూడా చల్లబడుతుంది.
వేప నూనె, ఆలివ్‌ ఆయిల్‌ను సమాన మోతాదులో కలిపి వేడి చేయాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడే ఆ మిశ్రమాన్ని వెంట్రుకలకు, మాడుకు రాసుకోవాలి. పావుగంట తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే చుండ్రు సమస్య ఉండదు.
చిన్న అల్లం ముక్కను సన్నని ముక్కలుగా తరిగి నువ్వుల నూనెలో వేయాలి. ఆ నూనెతో తలకు మర్దనా చేసుకోవాలి. రాత్రి నిద్రపోయే ముందు తలకు రాసుకొని ఉదయాన్నే షాంపూ తో శుభ్రం చేసుకోవాలి. కలబంద గుజ్జును మాడుకు పట్టించి పావు గంట తర్వాత షాంపూ తో శుభ్రం చేసుకోవాలి. వారానికి మూడు సార్లు ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గడమే కాకుండా వెంటుకలు మదువుగా మారతాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad