Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంభూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం

భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం

- Advertisement -

– మంత్రి వాకిటి శ్రీహరి
నవతెలంగాణ – ఉట్కూర్‌

నారాయణపేట్‌ – కొడంగల్‌ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక డైరీ డెవలప్మెంట్‌ యువజన మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. భూ నిర్వాసితులకు ప్రభుత్వం ఇచ్చే 14 లక్షలు రూపాయలు కాకుండా పెంచి ఇవ్వాలని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, ఎకరాకు దాదాపు 30 నుండి 40 లక్ష ల రూపాయలు ఇవ్వాలని ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని భూమికి భూమి ఇవ్వాలని కోరుతూ భూ నిర్వాసితులు ఆదివారం మక్తల్‌లో మంత్రి వాకిటి శ్రీహరికి కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలోనే ఇన్‌చార్జీ మంత్రితో కలిసి భూ నిర్వాసితులందరితో ఒక సమావేశం ఏర్పాటు చేయటం జరుగుతుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు విఘ్నేశ్వర్‌ రెడ్డి, పీఎసిఎస్‌ చైర్మెన్‌ బాల్‌ రెడ్డి, ఉట్కూర్‌ గ్రామ మాజీ సర్పంచ్‌ సూర్య ప్రకాశ్‌ రెడ్డి, మొట్కర్‌ మోహన్‌రెడ్డి, భూ నిర్వాసితులు గోపాల్‌ రెడ్డి, సురేందర్‌ రెడ్డి ,మేకల నర్సింలు, సంజనోల్ల సంజప్ప ,సంజనోల రాము ,రామ్‌ రెడ్డి ,చిట్టి రమేష,్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad