– డ్యామ్ సేఫ్టీ అధికారుల
సూచనల మేరకే నీరు విడుదల : మంత్రి దామోదర్ రాజనర్సింహ
నవతెలంగాణ-పుల్కల్
సింగూర్ ప్రాజెక్టుకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యా రాకుండా శాశ్వత పరిష్కారం చూపనున్నట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్ట్‌ను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సింగూర్ ప్రాజెక్టుకు ప్రస్తుతం డ్యామ్ సేఫ్టీ అధికారులు కొన్ని సూచనలు తెలియజేశారన్నారు. అందుకోసం ప్రభుత్వం రూ.16 కోట్లను విడుదల చేసిందన్నారు. దీనికి సంబంధించి టెండర్లు కూడా పూర్తి అయ్యాయని తెలిపారు. డ్యామ్ సేఫ్టీ అధికారులు సూచనలకనుగుణంగా ప్రాజెక్టులో నీటిమట్టాన్ని ఉంచడం జరుగుతుందన్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతుందని వాటిని దిగువ ప్రాంతాలకు వదిలేయడం జరుగుతుందన్నారు. డ్యామ్ సేఫ్టీ అధికారుల సూచనల మేరకే నీటిని విడుదల చేస్తున్నామన్నారు. అదేవిధంగా సింగూర్ రాజనర్సింహ ఎడమ కాలువను సీసీ చేసేందుకు ప్రభుత్వం రూ.160 కోట్లను మంజూరు చేసిందన్నారు. ఆ నిధులను ఎడమ కాలువకు పూర్తిగా వినియోగిస్తామని చెప్పారు. ప్రస్తుతం రైతుల కోరిక మేరకు ఆ పనులు నిలిపివేసి వ్యవసాయానికి నీరు అందిస్తున్నా మన్నారు. తర్వాత పనులను కొనసాగిస్తామన్నారు. అంతకుముందు మంత్రి దామోదర ఇసోజిపేట గ్రామంలో తెగిపోయిన ఎడమ కాలువను ట్రాక్టర్‌పై వెళ్లి పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశిం చారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్, ఆర్డిఓ, ఇరిగేషన్ అధికారులు మండల అధికారులు ఉన్నారు
సమస్యలు రాకుండా సింగూర్ ప్రాజెక్టుకు శాశ్వత పరిష్కారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES