– రెండు వాహనాలు ఢీకొని
– ఏడుగురు సజీవ దహనం
సురేంద్రనగర్ : గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం ఏడుగురు మరణించారు. దేదాదర గ్రామం సమీపంలో స్విఫ్ట్ డిజైర్ కారు, టాటా హారియర్ ఎస్‌యూవీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అధికారులు ధ్రువీకరించారు. ఈ ప్రమాదం చాలా తీవ్రంగా ఉండడం వెంటనే వాహనాన్ని మంటలు అలుముకున్నాయి. వాహనంలోనే ప్రయాణికులంతా చిక్కుకుపోయారు. సమాచారం మేరకు మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఘటన జరిగినట్టు సమాచారం. ప్రమాదం తీవ్రత నేపథ్యంలో డిజైర్ వాహనంలో ఉన్న ప్రయాణికులంతా మృతి చెందినట్టు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గాయపడ్డ వారిని రక్షించి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.స్థానికులు డిజైర్ వాహనంలో ఉన్న వారిని కాపాడేందుకు ప్రయత్నించినా మంటల్లో ఏడుగురు కాలిపోయినట్టు పోలీసులు పేర్కొన్నారు. వాధ్వన్ పోలీస్ స్టేషన్ నుంచి ఇన్‌స్పెక్టర్ పీబీ జడేజా మాట్లాడుతూ.. ‘దేదాదర గ్రామం సమీపంలో మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగిన సంఘటన తర్వాత కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారని.. ఎస్‌యూవీలో ఉన్న ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారని చెప్పారు. ఈ ఘటనతో రద్దీగా ఉండే హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. వాహనాలు వేగంగా ఉండడం వల్లే అదుపు తప్పి ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నట్టుగా అనుమానిస్తున్నారు. దాంతో మంటలు చెలరేగాయని పలువురు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
- Advertisement -
- Advertisement -