నవతెలంగాణ – హైదరాబాద్ :రాబోయే ఆసియా కప్ 2025 కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సంచలన నిర్ణయం తీసుకుంది. జట్టుకు కీలక ఆటగాళ్లుగా ఉన్న స్టార్ బ్యాటర్లు బాబర్ అజామ్, వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్‌లను పక్కనపెడుతూ 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. జట్టుకు సల్మాన్ అలీ అఘాను కొత్త కెప్టెన్‌గా నియమించింది.
యూఏఈ, అఫ్గానిస్థాన్‌లతో జరగనున్న ముక్కోణపు సిరీస్‌తో పాటు, ఆసియా కప్ కోసం కూడా ఇదే జట్టును పీసీబీ ఖరారు చేసింది. జట్టులో స్టార్ పేసర్ షహీన్ షా అఫ్రిది, ఫఖార్ జమాన్, హరీస్ రవూఫ్, హసన్ అలీ వంటి సీనియర్లకు చోటు కల్పించారు. వికెట్ కీపర్‌గా మహమ్మద్ హరీస్‌ను ఎంపిక చేశారు. అదే సమయంలో, సయీమ్ అయూబ్, హసన్ నవాజ్ వంటి యువ ఆటగాళ్లకు కూడా అవకాశం ఇచ్చారు.
పాకిస్థాన్ జట్టు
సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హారిస్ రవూఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలత్, ఖుష్దిల్ షా, మహమ్మద్ హారిస్ (వికెట్ కీపర్), మహమ్మద్ నవాజ్, మహమ్మద్ వసీం జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షహీన్ షా అఫ్రిది, సుఫియాన్ మోఖిమ్.