- Advertisement -
నవతెలంగాణ -హైదరాబాద్: రామంతాపూర్ లో జరిగిన విద్యుత్ షాక్ ఘటనలో మరొకరు చనిపోయారు. ఆగస్టు 17న అర్థరాత్రి శ్రీకృష్ణ రథానికి విద్యుత్ షాక్ తగిలి ఐదుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గాయపడి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న గణేష్ ఇవాళ (ఆగస్టు 18న) మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య ఆరుకి చేరింది. ఇంకా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో కృష్ణ యాదవ్(24), శ్రీకాంత్ రెడ్డి(35), సురేష్ యాదవ్(34), రుద్ర వికాస్(39), రాజేందర్ రెడ్డి(39),గణేష్ లు ఉన్నారు.
- Advertisement -