- Advertisement -
నవతెలంగాణ – అమరావతి: తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమైన భక్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం మండిపల్లి వద్ద ఈ రోజు ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -