Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సోపూర్ లో వర్షానికి భారీపంట నష్టం..

సోపూర్ లో వర్షానికి భారీపంట నష్టం..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
సోపూర్ గ్రామంలో భారీ వర్షానికి పలు పంటలకు అపార నష్టం కలిగిందని గ్రామ రైతులు తెలిపారు. ఈ సందర్భంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువన ఉన్న కర్ణాటక మహారాష్ట్ర నుండి దిగువకు భారీగా నీరు వచ్చి చేరుతోందని అన్నారు. కౌలస్ నానా ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ దగ్గర్లో తమ గ్రామము గ్రామం ఉందని, ఎగువ నుండి వస్తున్న వరద ఉధృతి నీరు వాగు పక్కన ఉన్న పంట పొలాలలో భారీగా నీరు చేరి అపార పంట నష్టం వాటిలిందన తెలిపారు.

సోయా , పత్తి , మినుము , పెసర , కందితో పాటు కూరగాయల పంటలకు భారీగా నష్టం వాటిల్లిందని అన్నారు. గ్రామంలో సుమారుగా 60 నుండి 70 ఎకరాలలో పంటలు పండిస్తున్న రైతులకు భారీగా పంట నష్టం జరగడమే కాక విద్యుత్ స్తంభాలు విరిగి పోయాయని తెలిపారు. విద్యుత్తు వైర్లు  పడిపోయాయని అన్నారు. అదేవిధంగా రైతులకు ఉపయోగపడే అరక సామాన్లు నీటి ఉధృతికి కొట్టుకుపోయాయని తెలిపారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad