Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – జడ్చర్ల
నసురుల్లబాద్  గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  375వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచ్ల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రనిల్ చందర్ పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  మొఘల్ సామ్రాజ్యవాదులతో పోరాడి గోల్కొండ కోటను జయించి రాజ్య స్థాపన చేశారు. ఆర్థిక బలం ధన బలం పూర్వ రాజరిక వ్యవస్థ నుంచి రాకున్నా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  తన సొంతంగా గెరిల్లా సైన్యాన్ని ఏర్పరచుకొని తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా నుంచి గోల్కొండ కోటను జయించడం జరిగింది.

జమీందారులు, దొరలు, భూస్వాములు, తాబేదారుల అరాచకాలను అణిచివేసేందుకు ఉద్భవించిన మహా వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  అని తెలియజేశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  పోరాటపటిమను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలి బడుగు బలహీన వర్గాల  ఐక్యతగా ఉండి తమ హక్కుల కొరకు పోరాటం చేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో శంకరయ్య గౌడ్, నాగయ్య గౌడ్, చంద్రశేఖర్, ప్రభుత్వ ఉపాధ్యాయులు శ్రీనివాస్ గౌడ్, మహేష్ గౌడ్ మరియు ఇతర గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad