Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్అధికారులకు అండగా మేము సైతం ..

అధికారులకు అండగా మేము సైతం ..

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
భారీ వర్షాల మూలంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు అలర్ట్ చేసింది. మద్నూర్ మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అధికారులకు అండగా మేము సైతం అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు పొంగి పొర్లుతున్న వాగులు వంకల పరిశీలనలో పాల్గొంటున్నారు. మద్నూర్ మండలంలోని అంతాపూర్ సోమూరు మధ్యల గల వాగు పొంగిపొర్లుతోంది. దీని మూలంగా మద్నూర్ జుక్కల్ మండలాల పరిధిలోని గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మండల తహశీల్దార్ ఎండి ముజీబ్, ఎంపీడీవో రాణి, ఎస్సై విజయ్ కొండ ఆయా గ్రామాల గ్రామ కార్యదర్శులు వాగును సందర్శించి, పరిశీలించారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్లు స్వామి, కొండ గంగాధర్, వట్నాల రమేష్, తడుగూరు ఈరన్న, తదితరులు అధికారుల పరిశీలనలో గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. భారీ వర్షాలతో మండల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అప్రమత్తంగా ఉండాలని నాయకులు తెలిపారు. జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ఆదేశాల మేరకు వరద తాకిడి గ్రామాలకు పర్యటించే అధికారులకు అండగా మేము సైతం అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు అండగా నిలిచేందుకు పర్యటనలు జరుపుతున్నారు. అధికారులకు అండగా అధికార పార్టీ నాయకులు సందర్శనలు చేయడం ఇటు అధికార యంత్రాంగం అటు అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు ప్రజల ఇబ్బందులను గుర్తించి తక్షణ చర్యలు చేపడుతున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad