Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్అంబరాన్నంటిన ఝాన్సీ రెడ్డి జన్మదిన సంబరాలు

అంబరాన్నంటిన ఝాన్సీ రెడ్డి జన్మదిన సంబరాలు

- Advertisement -

– శివాని ట్రస్ట్ ఆధ్వర్యంలో వాటర్ బాటిల్స్ పంపిణీ
– రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన నాయకులు
– మహా అన్నదాన వితరణకు విచ్చేసిన ప్రజలు
నవతెలంగాణ – రాయపర్తి
టిపిసిసి ఉపాధ్యక్షురాలు, పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను సోమవారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంబరాన్నంటేలా నిర్వహించారు. ఝాన్సీ రెడ్డి విచ్చేయగా మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. కార్యకర్తలు భారీ కేక్ ఏర్పాటు చేయగా వారు కట్ చేశారు. తదుపరి టిపిసిసి మాజీ కార్యదర్శి, శివాని చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బిల్లా సుధీర్ రెడ్డి నేతృత్వంలో వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గం ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటా అని తెలిపారు.

రాయపర్తి మండల ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటా అని, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకొని ఎప్పుడు అండగా ఉంటా అని హామీ ఇచ్చారు. రాయపర్తి మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా అని తెలిపారు. మండల పార్టీ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా జన్మదిన వేడుకలను నిర్వహించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హమ్య నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, టిపిసిసి మాజీ కార్యదర్శి బిల్లా సుధీర్ రెడ్డి, పాలకుర్తి ఆలయ చైర్మన్ కృష్ణమాచార్యులు, ఈఎంసి వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి, యూత్ మండల అధ్యక్షుడు కోతి కళ్యాణ్, మండల నాయకులు మాచర్ల ప్రభాకర్, ముద్రబోయిన వెంకటేశ్వర్లు, ఎండి ఆఫ్రోస్, మచ్చ నీలయ్య, గబ్బెడ బాబు, ఉల్లెంగుల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad