నవతెలంగాణ – రాయపర్తి
రాయపర్తి మండల కేంద్రంలో వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారి పక్కన రుద్ర ఫుడ్ కోర్టు (అర్ఎఫ్సి) నూతన ఔట్‌లెట్ రావడంతో స్థానికులకు చక్కటి విందు అందుబాటులోకి రానుంది. సోమవారం ఫుడ్ కోర్టును కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు సత్తూరి నాగరాజు మాట్లాడుతూ… అత్యుత్తమ బిర్యానీతో పాటు మరెన్నో ఆహార పదార్థాలను అతిథులు(కస్టమర్స్) ఆస్వాదించవచ్చు అన్నారు. అతిథులకు నాణ్యత, పరిశుభ్రతతో అతి జాగ్రత్తగా ప్రస్తుత కాలంలో అవసరమైన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఆహారాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు.
ఆర్ఎఫ్సి ఫుడ్ కోర్టులో కస్టమర్స్ అభిఇష్టం మేరకు ఆహారాన్ని తయారుచేసి అందించడం జరుగుతుందని తెలిపారు. రాయపర్తి మండల ఆహార ప్రియులు తమ అభిమాన టిఫిన్స్, మిల్స్, బిర్యానీ, వెజ్, నాన్ వెజ్ రుచులను ఆర్ఎఫ్సి ఫుడ్ కోర్టులో ఆస్వాదించవచ్చు అన్నారు. సరసమైన ధరలకే అత్యంత రుచికరమైన, నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మాచర్ల ప్రభాకర్, ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు ముద్రబోయిన వెంకటేశ్వర్లు, ఈఎంసి మాజీ వైస్ చైర్మన్ ఎండి నాయిమ్, చిర్ర ఎల్లయ్య, పిరని ప్రవీణ్, ఎండి ఫిరోస్ తదితరులు పాల్గొన్నారు.
రాయపర్తిలో రుద్ర ఫుడ్ కోర్టు ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES