నవతెలంగాణ – రాయపర్తి
బహుజన ప్రజల యోధులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షుడు, మాజీ జడ్పిటిసి రంగ కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకొని మండలంలోని మైలారం గ్రామంలో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 16వ శతాబ్దంలోనే బహుజన హక్కుల కోసం పోరాడిన మానవతవాది సర్వాయి పాపన్న గౌడ్ అని తెలిపారు. నాడు సర్వాయి పాపన్న చేసిన ఉద్యమం చరిత్రలో నిలిచిపోయింది అన్నారు. ఆయన ఆశయ సాధనకై ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని వైభవంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధికార ప్రతినిధి తాళ్లపెల్లి సంతోష్ గౌడ్, గౌడ సంఘం నాయకులు నారగోని సాంబయ్య, కోలా కొమురయ్య, బైరు యాకన్న, కోలా కుమారస్వామి, బైరు సుధాకర్, బీఆర్ఎస్ మండల పార్టీ నాయకులు చెడుపాక కుమార్, గబ్బేట యాకయ్య, చందు రామ్, పోగులకొండ వేణు, బాధ రవి, ఎనగందుల యాదగిరి, చందు లక్ష్మన్, ఐత జంపి, శివరాత్రి సమ్మయ్య, గొడుగు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
బహుజన ప్రజల యోధుడు సర్వాయి పాపన్న గౌడ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES