నవతెలంగాణ – కాటారం
తెలంగాణ రాష్ట్ర ఐటి పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును సోమవారం రోజున కాటారం మండలం దేవరాంపల్లి (రేగులాగూడెం గ్రామపంచాయతీ) గ్రామానికి చెందిన పలువురు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిని కలిసి పలు సమస్యలను వారికి వివరించారు. ముఖ్యంగా గ్రామపంచాయతీ పరిధిలో సీసీ రోడ్లను మంజూరు చేయాలని వారిని కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలోనే సిసి రోడ్ల మంజూరు పై ప్రతిపాదన చేస్తామని చెప్పడంతో వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఐలినేని నవీన్ కుమార్, గంధం బాలరాజు, గంధం భీమయ్య, పాగే సురేష్,పాగే సమ్మయ్య, కుమ్మరి నగేష్,జిముడ పెద్ద రాజయ్య,జనగాం నారాయణ,మారపాక లింగయ్య ,సోదరి రాజమల్లు, సోదరి మల్లయ్య పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన దేవరాంపల్లి వాసులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES