- Advertisement -
హైదరాబాద్ : మురుగప్ప గ్రూప్‌నకు చెందిన మోంట్రా ఎలక్ట్రిక్ హైదరాబాద్‌లో తన తొలి విద్యుత్ చిన్న వాణిజ్య వాహన డీలర్‌షిప్‌ను ప్రారంభించింది. దీన్ని శ్రీరామ్ హర్షతో కలిసి ఏర్పాటు చేసింది. ఈ డీలర్‌షిప్‌లో లాజిస్టిక్స్, కార్గో రవాణా కోసం రూపొందిన అధిక పనితీరు గల ఈవియేటర్ వాహనాన్ని ప్రదర్శించింది. ”హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న విద్యుత్ వాహన మార్కెట్, లాజిస్టిక్స్ కేంద్రం. ఈ డీలర్‌షిప్‌తో ఉద్గారరహిత, తెలివైన రవాణా పరిష్కారాలను అందిస్తాము,” అని మోంట్రా ఎలక్ట్రిక్ ఎండీ జలజ్ గుప్తా పేర్కొన్నారు.
- Advertisement -