- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కాంగోలో తిరుగుబాటుదారులు దారుణానికి పాల్పడ్డారు. 52 మందిని నిర్దాక్షణంగా నరికి చంపేశారు. కాంగో దళాల చేతిలో చావుదెబ్బ తినడంతో ఇస్లామిక్ స్టేట్ మద్దతుగల తిరుగుబాటుదారులు కోపంతో రగిలిపోయి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బెని, లుబెరో ప్రాంతాల్లోని పౌరులపై అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ తిరుగుబాడుదారులు పాల్పడిన ఈ అమానుష దాడిలో 52 మంది చనిపోగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయని అధికారులు తెలిపారు.
- Advertisement -