నవతెలంగాణ-హైదరాబాద్: వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో బీహార్ ఎస్ఐఆర్ పై చర్చ జరగాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంగానే..ఓట్ చోరీ వ్యవహారంపై ఉభయసభల్లో చర్చ నిర్వహించాలని పార్లమెంట్ ప్రాంగణంలో ప్రతిపక్షాల ఎంపీలు నిరసన చేపట్టాయి. ఓట్ల చోరీ వెంటనే ఆపేయలని భారీ బ్యానర్ చేతపట్టుకొని ఎన్నికల కమిషన్ తీరును నిరసిస్తూ..ప్రధాన కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో విపక్ష ఎంపీలు భారీ యెత్తున పాల్గొన్నారు. ఆగష్టు 21 నుంచి ప్రారంభమైన వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈసీ చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియపై చర్చ జరగాలని విపక్షాలు కోరుతున్న మోడీ ప్రభుత్వం మొండి వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
మరోవైపు ఓట్ల నమోదు ప్రక్రియలో ఈసీకి, రాజకీయ పార్టీలకు మధ్య తలెత్తిన వివాదం పార్లమెంట్ సమావేశాల్లో చర్చిండం వీలు కాదని, ఎన్నికల సంఘంతో ఆయా రాజకీయ పార్టీలు నేరుగా వెళ్లి ఫిర్యాదు చేసుకోవాలని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మీడియా సమావేశంలో పేర్కొన్నారు.