- Advertisement -
నవతెలంగాణ – (వేల్పూర్ )ఆర్మూర్
మండలంలోని జానకంపేట స్వగ్రామానికి చెందిన తలారి సంజీవయ్య ఉత్తమ రైల్వే ఉద్యోగి అవార్డును మంగళవారం పొందినారు. సికింద్రాబాద్ లోని రైలు నిలయంలో సీనియర్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. రైల్వే చీఫ్ పర్సనల్ మేనేజర్ సిద్ధార్థ కట్ట నుండి అవార్డు తీసుకున్నారు. తమ గ్రామానికి చెందిన వ్యక్తికి అవార్డు రావడం పట్ల ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం మాజీ అధ్యక్షులు జంగం అశోక్, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేసినారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు శ్రీనివాస్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -