Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుఅవినీతి అధికారులపై ఏసీబీ నజర్..

అవినీతి అధికారులపై ఏసీబీ నజర్..

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
జిల్లాలోని ఆర్మూర్ ప్రాంతం బాల్కొండ నియోజకవర్గాల పరిధిలోని పలు ప్రభుత్వ కార్యాలయలపై ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారు. పట్టణంలోని  గత కొన్ని నెలల క్రితం పంచాయతీ రాజ్ శాఖలో పనిచేసే శ్రీనివాస్ శర్మను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆలూరు మండలంలోని రామచంద్ర పల్లి గ్రామానికి చెందిన గొట్టిముక్కల గ్రామపంచాయతీ కార్యదర్శి గంగా మోహన్ ను బాధితుడు రాజేందర్ లంచం డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పలు ప్రభుత్వ కార్యాలయాలలో కొన్ని శాఖలలో పనిని బట్టి ధరను నిర్ణయిస్తారు. మరికొన్ని కార్యాలయాల అధికారులు అమ్యామ్యా తీసుకోవడానికి  నమ్మకమున్న మనుషులను పెట్టుకున్నారు. పనికి ముందు వీరికి డబ్బులు ఇస్తే ఇట్టే పని జరిగిపోతుంది.

కొన్ని కార్యాలయాలలో ఎలాంటి పని అయినా డబ్బిస్తే అయిపోతుందని ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి లక్షల్లో జీతాలు తీసుకుంటున్న అధికారులు కార్యాలయాలకు వచ్చే ప్రజలకు పనులు చేసి పెట్టడం లేదు. అనవసరంగా కొర్రీలు పెట్టి వేధిస్తున్నారు. దీంతో చేసేది లేక తిరిగి మధ్యవర్తులకు డబ్బులు ఇచ్చి పనులు చేయించుకుంటున్న దుస్థితి ఏర్పడింది. ఈ విషయమై పై స్థాయి వరకు వెళ్లడంతో పలు కార్యాలయాలపై ఏసీబీ నాజర్ పెట్టినట్లు తెలిసింది. ఏసీబీ అధికారులు దాడులు చేసి అవినీతి అధికారులను పట్టుకుంటున్న కొన్ని శాఖల కార్యాలయాల అధికారులు ఏదో రూపంలో అవినీతికి పాల్పడుతున్నారు. పనులు చేయకుండా ఇబ్బందులు పెడుతూ డబ్బుల కోసం డిమాండ్ చేస్తున్న అధికారుల సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోరుతున్నారు. మరోపక్క కొందరు అధికారులు ఏళ్ల తరబడి తిష్ట వేసి నామమాత్రపు విధులు నిర్వహిస్తున్నారు. ఈనెల 5న సబ్ కలెక్టర్ గా అభిజ్ఞాన్ మాల్వియా పదవి బాధ్యతలు స్వీకరించినారు. ఇప్పటి నుంచైనా ప్రక్షాళన  జరగాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad