నవతెలంగాణ – పెద్దవూర
అనుముల మండలం, హాలియ మున్సిపాలిటీ పరిధికి చెందిన కంచర్ల సత్యనారాయణ రెడ్డి – లక్ష్మమ్మ, చలకుర్తి గ్రామానికి చెందిన సల్లా అంజిరెడ్డి ఆహ్వానం మేరకు మంగళవారం నూతన గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బుసిరెడ్డి ఫౌండేషన్ ఛైర్మెన్ బుసిరెడ్డి పాండన్న హాజరై పూజలు నిర్వహించారు. తదనంతరం కంచర్ల సత్యనారాయణ రెడ్డి బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలోతిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవల్లి దిలీప్ కుమార్ రెడ్డి, అనుముల మండలం మాజీ వైస్ యంపిపి తిరుమలనాధ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి, చింతపల్లి తాజా మాజీ సర్పంచ్ ప్రభావతి సంజీవరెడ్డి, నరేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, సల్లా అంజిరెడ్డి, సల్లా తిరుమల్ రెడ్డి,సల్లా వెంకట్ రెడ్డి, కొల్లు మల్లారెడ్డి, గొంది యాదగిరి రెడ్డి, పెంచలకుంట్ల నర్సిరెడ్డి, కొడుమూరు వెంకటరెడ్డి, వంగాల భాస్కర్ రెడ్డి, చామల మధుసూదన్ రెడ్డి, బుసిరెడ్డి మట్టా రెడ్డి, షేక్ అబ్దుల్ కరీం, పోలోజు రమేష్ చారి, అనుముల కోటేష్, తదితరులు పాల్గొన్నారు.
నూతన గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన్న బుసిరెడ్డి పాండన్న
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES