Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుఫొటోలు అవే మన జ్ఞాపకాలు: మంత్రి పొన్నం ప్రభాకర్

ఫొటోలు అవే మన జ్ఞాపకాలు: మంత్రి పొన్నం ప్రభాకర్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం బషీర్ బాగ్‌లోని టీయూడబ్ల్యూజే కార్యాలయ ఆడిటోరియంలో , తెలంగాణ స్టేట్ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో ఘ‌నం నిర్వ‌హించారు.ఈ కార్య‌క్ర‌మాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి లు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు. ఫొటోలు సందర్భాన్ని బట్టి కళాత్మకంగా బంధించడం అంత సులభం కాదని ఆయన అన్నారు. తాను విద్యార్థి సంఘ నాయకుడిగా ఉన్నప్పుడు, తెలంగాణ ఉద్యమ సమయంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికార, ప్రతిపక్షంలో ప్రత్యక్షంగా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నాం. ఆ ఫొటోలు చూస్తుంటే మన గతాన్ని గుర్తు చేస్తుంటాయి. మీ సమస్యలు మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామన్నారు. మీ కళాత్మక నైపుణ్యం క్షణాల్లో ఆలోచించే విధంగా ఫోటోలు ఉండాలి. మీ ఫొటోలు చిరస్థాయిగా మిగులుతాయి. అవే మన జ్ఞాపకాలు అని పొన్నం తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad