నవతెలంగాణ – సదాశివనగర్
మండలంలోని పద్మాజివాడి గ్రామానికి చెందిన మ్యదరి అంబిక (40 ) ఆమె గ్రామంలో ఆశా కార్యకర్తగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఆమె తన ఇంటిలో సోమవారం ఉరి వేసుకున్నట్లు తెలిపారు. ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. ఆమె కుమార్తె పెళ్లి చేసిన అప్పులపలైందని, మరోవైపు ఒంటరిగా ఉండడంతో బాధపడుతూ మరణించినట్లు తెలిపారు. గతంలో కూడా ఆత్మహత్యకు ప్రయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు పంచానామ నిర్వహించి పోస్టుమార్టం కోసం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డ ఆశా కార్యకర్త
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES