Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఆశారాం బాపూకు బెయిల్ పొడిగింపు

ఆశారాం బాపూకు బెయిల్ పొడిగింపు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: స్వయంప్రకటిత దేవుడు ఆశారాం బాపూకు మంజూరు చేసిన తాత్కాలిక బెయిల్‌ను గుజరాత్‌ హైకోర్టు మంగళవారం సెప్టెంబర్‌ 3 వరకు పొడిగించింది. ఆగస్ట్‌ 21న ముగియనున్న తాత్కాలిక బెయిల్‌ను సెప్టెంబర్‌ 3 వరకు పొడిగిస్తూ జస్టిస్‌ ఇలేష్‌ వోరా, జస్టిస్‌ పి.ఎం.రావల్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ తీర్పునిచ్చింది. ఆ తర్వాత కేసును విచారించనున్నట్లు ప్రకటించింది.

మరో అత్యాచార కేసులో ఆశారం దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను రాజస్థాన్‌ హైకోర్టు ఆగస్ట్‌ 29న విచారించనుంది. కోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఆశారం అహ్మదాబాద్‌లోని ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు సమాచారం.

2013 అత్యాచారం కేసులో దోషిగా తేలిన ఆశారాం బాపూకి గాంధీనగర్‌ కోర్టు జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. వైద్యకారణాలతో ఆగస్ట్‌ 21 వరకు ఆశారాంకు మధ్యంతర బెయిల్‌ను పొడిగిస్తున్నట్లు గుజరాత్‌ కోర్టు గతంలో ఆదేశించింది. ఆరోగ్యం క్షీణిస్తున్నందున తాత్కాలిక బెయిల్‌ కోసం గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించవచ్చని జులై 30న సుప్రీంకోర్టు ఆదేశించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad