- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
రైతులు పంట సాగులో భాగంగా నానో యూరియా తో ఖర్చు తగ్గి,లాభదాయకంగా ఉంటుందని మండల వ్యవసాయ అధికారిణి భాను శ్రీ అన్నారు. మంగళవారం మండలంలోని పోసానిపేట్, రామారెడ్డి తో పాటు అన్నారం రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమంలో రైతులతోపాటు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ… పురుగుల మందులు, శిలింద్రియనాశకలు వాడేటప్పుడు మాస్కులు, బ్లౌజులతోపాటు కళ్ళజోడులు వాడాలని రైతులకు సూచించారు. 500 ఎంఎల్ నానో యూరియా బాటిల్ 45 కేజీల సాంప్రదాయ బస్తకు సమానమని సూచించారు. 8 శాతం దిగుబడి పెరుగుతుందని సూచించారు. కార్యక్రమంలో ఏఈవోలు రాకేష్, శ్రీనివాస్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -