Wednesday, August 20, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్స్మార్ట్ ఫోన్స్.. ఏఐ రాకతో ఫోటోగ్రాఫర్ల జీవనం ఆగం

స్మార్ట్ ఫోన్స్.. ఏఐ రాకతో ఫోటోగ్రాఫర్ల జీవనం ఆగం

- Advertisement -

– ఫోటోగ్రాఫర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు పోగుల కొండ అశోక్
– ఫోటో గ్రాఫర్లకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానం
నవతెలంగాణ – రాయపర్తి
నాడు స్మార్ట్ ఫోన్ లు.. నేడు ఏఐ రాకతో ఫోటోగ్రాఫర్ల జీవనం చిన్నబిన్నం అవుతుందని రాయపర్తి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు పొగులకొండ అశోక్ తన మనోగదాన్ని వెల్లడించారు. మంగళవారం 186వ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో ఫోటోగ్రఫీ జెండాను అశోక్ ఆవిష్కరించారు. ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అశోక్ మాట్లాడుతూ.. ఫోటోలు చెదిరిపోని మధుర స్వప్నాలు అని కొనియాడారు. మనిషి మరణం తర్వాత కూడా అతని రూపురేఖలను స్పష్టంగా చూపెట్టే ఏకైక దర్పణం ఫోటో మాత్రమే అని తెలిపారు. నాడు ఫోటోగ్రాఫర్ల జీవనం రంగుల మయంగా విరజిలేదని ప్రస్తుతం టెక్నాలజీల రాకతో జీవనం వెలవెల పోతుందని అని ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రాల్లో ఫోటో స్టూడియోలు పెట్టుకునే పరిస్థితి కనిపించడం లేదని బాధపడ్డారు.

ప్రభుత్వం ఫోటోగ్రాఫర్లను కార్మికులుగా గుర్తించి సబ్సిడీ రుణాలు అందించాలని కోరారు. తదుపరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్లకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బూరుగు నవీన్, ఉపాధ్యక్షుడు బొమ్మెర నరేష్, ముఖ్య సలహాదారులు మల్లేష్, సోషల్ మీడియా కన్వీనర్ ఆకారపు విష్ణు, కార్యదర్శి రాపాక ప్రశాంత్, పులి మహేందర్, గోరంట్ల ప్రభాకర్, చందు రాము, దాసరి రాము, శ్రీధర్,ఎలుకపెల్లి రమేష్, మొరిపోజు రాజేష్ , లయన్స్ క్లబ్ ఆఫ్ వర్ధన్నపేట అధ్యక్షుడు బుద్ధ సునీల్ కుమార్, సెక్రెటరీ గారె నర్సయ్య, ట్రెజరర్ కంది ప్రభాకర్, క్లబ్ సభ్యులు రావుల అనిల్ కుమార్, ఎండి నయీమ్, కానూరి వెంకటేశ్వర్లు, పోగులకొండ వేణు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad