రోహిత్ వర్మ, రియా సుమన్ జంటగా నటిస్తున్న నూతన చిత్రం మంగళవారం రామానాయుడు స్టూడ ియోలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభ మైంది. క్రేజీ కింగ్స్ స్టూడియోస్ ఎల్.ఎల్.పి. బ్యానర్‌పై నజీర్ జమాల్ నిర్మిస్తుండగా, గోవిందరెడ్డి చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.
హీరో, హీరోయిన్లపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి విజరు కనకమేడల క్లాప్ కొట్టగా, సీనియర్ దర్శకుడు రామ్ ప్రసాద్ కెమెరా స్విచాన్ చేశారు. మరో దర్శకుడు మల్లిఖార్జున గౌరవ దర్శకత్వం వహించారు.
నిర్మాత నజీర్ జమాల్ మాట్లాడుతూ,’తెలుగులో నాకిది మొదటి సినిమా. కథ బాగా నచ్చి సినిమా చేయడానికి ముందుకు వచ్చాను. రోహిత్ ఇందులో పాటలు అద్భుతంగా ఉంటాయి’ అని తెలిపారు. ‘ఓ క్రేజీ కథతో రాబోతున్నాం. కథ అందరికీ కనెక్ట్ అయ్యేవిధంగా వుంటుంది. రోహిత్ హిందీలో చేశాడు. తెలుగులో మొదటి సినిమా. రియా కథ నచ్చి బాగా సపోర్ట్ చేసింది. ఇది పక్కా కమర్షియల్ సినిమా’ అని దర్శకుడు గోవిందరెడ్డి చంద్ర చెప్పారు.
నయా క్రేజీ స్టోరీ..
- Advertisement -
- Advertisement -