No menu items!
Wednesday, August 20, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeసినిమాఓ ఛాలెంజ్‌గా తీసుకున్నాం

ఓ ఛాలెంజ్‌గా తీసుకున్నాం

- Advertisement -

విజయ రామరాజు టైటిల్‌ రోల్‌ పోషించిన స్పోర్ట్స్‌ డ్రామా ‘అర్జున్‌ చక్రవర్తి’. విక్రాంత్‌ రుద్ర దర్శకుడు. నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా నిర్మాత శ్రీని గుబ్బల మీడియాతో ముచ్చటించారు.
కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో ఇప్పటికే కొన్ని కథలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో చూపిస్తున్నంత సీరి యస్‌గా ఇప్పటివరకు సినిమా రాలేదు. కచ్చితంగా ఇదొక బెంచ్‌ మార్క్‌ మూవీ అవుతుందని ఛాలెంజ్‌గా తీసుకుని సినిమా చేశాం.
నల్గొండకి చెందిన కబడ్డీ ప్లేయర్‌ నాగులయ్య. ఆయన్ని అర్జున్‌ అని కూడా పిలుస్తారు. ఆయన అద్భుతమైన ప్లేయర్‌. 60 శాతం ఆయన జీవితంలోని సంఘటనలతోపాటు 40% ఫిక్షన్‌తో ఈ సినిమా చేశాం. ఇందులో మంచి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కూడా ఉంటాయి. ఇందులో మా హీరో విజయ రామరాజు అత్యద్భుతంగా నటించాడు.
డైరెక్టర్‌ విక్రాంత్‌ సినిమాని చాలా అద్భుతంగా తీశాడు. విఘ్నేష్‌ భాస్కరన్‌ చాలా మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. ఇప్పటికే రిలీజైన 2 పాటలుకి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. రీ-రికార్డింగ్‌ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.
ఇప్పటివరకు 46 ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వచ్చాయి. ఇక ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారనే ఆసక్తితో ఎదురు చూస్తున్నాను. ఇండియాలోనే మెట్రో ఆడియన్స్‌తో పాటు యూఎస్‌, యూకే, యూరప్‌, సౌత్‌ ఆఫ్రికా అన్ని చోట్ల ఈ సినిమాని రిలీజ్‌ చేయడానికి రెడీ అవుతున్నాం. సినిమా రిలీజ్‌ అయిన మూడు రోజులు తర్వాత కచ్చితంగా మారుమూల గ్రామాల్లో కూడా సినిమా వెళ్తుతుందనే నమ్మకం ఉంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad