సినీ కార్మికుల వేతన పర్సంటేజీని పెంచుతామని ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారని ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కుమార్ తెలిపారు.
కార్మికుల వేతన పెంపు డిమాండ్‌పై ఏడు యూనియన్లతో ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు మంగళవారం మరోసారి చర్చించారు.
ఈ సందర్భంగా వల్లభనేని అనిల్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ‘ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు కండీషన్స్ గురించి మాట్లాడారు. మా అభిప్రాయాలు తెలుసుకున్నారు. బుధవారం ఉదయం నిర్మాతలతో చర్చించి, సాయంత్రం అందరికీ అమోద యోగ్యమైన ఫలితాన్ని ప్రకటిస్తారు. మా కష్టాలు చూసి పర్సంటేజీ పెంచుతామని చెప్పారు. మూడు యూనియన్లకు కూడా వేతన పెంపు చేస్తామన్నారు. అయితే ఎంత పర్సంటేజీ అనేది రేపు మాట్లాడి చెబుతారు. దీంతో అన్ని యూనియన్లకు వేతన పెంపు ఉంటుందని ఆశిస్తున్నాం. తెలంగాణలో హైదరాబాద్‌ని సినిమా హబ్‌గా మారుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అందుకే ఆయన చిత్ర పటానికి పాలాభిషేకం చేశాం. ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో జరిపిన చర్చల వివరాలను ఫోన్‌లో చిరంజీవికి తెలియజేస్తాం’ అని అన్నారు.
వేతన పెంపుపౖెె ఫిల్మ్ ఛాంబర్ సానుకూల స్పందన
- Advertisement -
- Advertisement -