Wednesday, August 20, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుపిఆర్టియు మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ

పిఆర్టియు మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ-బాల్కొండ: పీఆర్టియు ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న హైదరాబాద్ లో జరగనున్న సిపిఎస్ ను రద్దు చేయాలని మహాధర్నా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మండల కేంద్రంలో మహా ధర్నా పోస్టర్ ను పిఆర్టియు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిఆర్టియు మండల అధ్యక్షులు వేల్పూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. జీవితాంతం ఉద్యోగులుగా ప్రజాసేవ చేసిన ఉపాధ్యాయుల, ఉద్యోగుల జీవితాలను “కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్” అంధకారం చేస్తుందని అన్నారు.షేర్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య రిటైర్మెంట్ తర్వాత వారి జీవితం రోడ్డునపడే పరిస్థితి రావచ్చని ఆవేదన వ్యక్తం చేస్తూ ..సిపిఎస్ ను రద్దుచేసి వెంటనే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రతాపరెడ్డి, జిహెచ్ఎం రాజేశ్వర్ రెడ్డి ,రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఎం.ప్రశాంత్ కుమార్, జి.సురేష్ కుమార్, ఎం.సాయన్న, భోజన్న, శంకర్, లక్ష్మీనారాయణ, మండల అసోసియేట్ అధ్యక్షులు పిల్లి గోపి, మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad