Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలునవతెలంగాణ కథనానికి స్పందన..

నవతెలంగాణ కథనానికి స్పందన..

- Advertisement -

– సోపూర్ గ్రామంలో పశు వద్య శిబిరం నిర్వహణ..
– అనారోగ్యంగా ఉన్న పశువులకు చికిత్స,  వ్యాక్సినేషన్ ..
నవతెలంగాణ – జుక్కల్

“వింత వ్యాధితో  పశువుల మరణాలు” అనే శీర్షికను నవతెలంగాణ దినపత్రికలో సోమవారం ప్రచురితమైంది. మంగళవారం గ్రామంలో మండల పశువైద్యాధికారీ ఆదేశాలతో సోపూర్ గోపాలమిత్రుడు రాము పశువులలో వైద్య శిబిరం నిర్వహించి చికిత్స చేశారు. పశువులకు లంపి స్కిన్  డిసీజ్ (ఎల్ఎస్డి) అనే వ్యాధి  సోకిందని తెలిపారు. ఎల్ ఎస్ డి వ్యాధికి ముందస్తుగా గత మూడు నెలల క్రితమే మండలంలోని అన్ని గ్రామాలలో వ్యాక్సినేషన్ చేశామని తెలిపారు. నాడు గ్రామాలలో వ్యాక్సీనేషన్ వేస్తున్న క్రమంలో పశువులకు టీకాలను వేయించేందుకు ముందుకు రాలేదని తెలిపారు. పశువులు గర్భంతో ఉన్నాయని , చిన్న వయసులో ఉన్నాయి అని , ఏవేవో కారణాలు చెప్పి పశువులకు వ్యాక్సినేషన్ వేయకుండా తప్పించారని అన్నారు.

అప్పుడే వ్యాక్సిన్ వేస్తే ఇప్పుడు ఈ వ్యాధి రాకపోయేదని తెలిపారు.  ప్రస్తుతము ఎల్ఎస్ డి అనే వ్యాధి పశువులకు సోకిందని వివరించారు. ఇది చాలా భయంకరమైన వ్యాధి అని, ఈ వ్యాధి సోకితే వ్యాక్సినేషన్ ఇప్పించడం తప్ప వేరే మార్గం లేదని తెలిపారు. ఎల్ ఎస్ డి వ్యాధికి వ్యాక్సినేషన్ వేయకపోతే పశువులకు మరణం తప్ప వేరే మార్గం ఉండదని తెలిపారు. ఈ వ్యాధి పక్కనున్న పశువులకు కూడా సోకే అంటువ్యాధి అని తెలిపారు. పత్రికలో వెలుబడిన వార్తా కథనాన్ని చూసి, వెంటనే గ్రామాన్ని సందర్శించి పరిశీలించామని తెలిపారు.

మంగళవారం గ్రామంలో పాడి రైతుల ఇంటింటికి తిరిగి సంబంధించిన అనారోగ్యంగా ఉన్న పశువులకు చికిత్స చేసి వ్యాక్సినేషన్ చేశామని తెలిపారు. టీకాలు వేయడం వలన పశువులకు ప్రాణాపాయం నుండి కాపాడడం జరిగిందని పశు వైద్యుడు పండరి తెలిపారు. ఇటువంటి వ్యాధులు రాకుండా ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులను మూడు నెలల క్రితమే అప్రమత్తం  చేసామని అన్నారు. సోపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి అశోక్ రాథోడ్, గోపాలమిత్రుడు రాము ఆధ్వర్యంలో చికిత్స వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిపి కార్యదర్శి, గోపాలమిత్రుడు, పశు వైద్య సిబ్బంది , గ్రామస్తులు , పాడి రైతులు , నాయకుడు సూర్నార్ శివాజీ పటేల్,  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad