Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుబాండెడ్ లేబర్ కు రెండెకరాల భూమి ఇవ్వాలి: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

బాండెడ్ లేబర్ కు రెండెకరాల భూమి ఇవ్వాలి: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

- Advertisement -

నవతెలంగాణ-భిక్కనూర్
బాండెడ్ లేబర్ కి రెండు ఎకరాల భూమి ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని అంతంపల్లి గ్రామ శివారులో ఉన్న చైతన్య నగర్ గ్రామాన్ని సందర్శించారు. కాలనీలో నివాసం ఉంటున్న బాండెడ్ లేబర్ దగ్గరికి వెళ్ళి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నివాసముంటున్న వారి ఇండ్లలో స్వయంగా తిరుగుతూ ప్రజలతో మట్లడారు. అనంతరం లేబర్ మాట్లాడుతూ.. బాండే లేబర్ గా గుర్తించి రెండు ఎకరాల భూమి, ఇల్లు, ప్లాటు ఇస్తామని చెప్పి భూములు ఇవ్వలేదని, ఇచ్చిన భూమిని సైతం తిరిగి తీసుకున్నారన్నారు. అనంతరం జాన్ వెస్లీ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి బాండెడ్ లేబర్ గా ఉన్నటువంటి  ప్రతి కుటుంబానికి రెండు ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది బాండెడ్ లేబర్ హక్కు అని, పార్టీలకతీతంగా అందరూ సుముఖంగా ఉండాలన్నారు.

పేదోడి ఇల్లు, భూముల కోసం రాజకీయాలు చేయొద్దన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వయంగా లేఖ రాసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, ధైర్యంగా ఉండాలన్నారు. ఎర్రజెండా మీకు అండగా ఉంటుందని, కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. అలాగే జంగంపల్లి గ్రామం మల్లు స్వరాజ్యం కాలనీలో నివాసముంటున్న ప్రజల వద్దకు వెళ్ళి వర్షంలోనూ ప్రతి ఇల్లు తిరిగి వారి వివరాలు తెలుసుకున్నారు.

గ్రామస్తులు గత కాంగ్రెస్ ప్రభుత్వం 2008లో మాకు పట్టాలి ఇచ్చినప్పటికీ కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం నేషనల్ హైవే ప్రక్కన విలువైన  భూమిని కబ్జా చేయడానికి కుట్ర పన్నుతూ వీడీసీ పేరుతో  పోరాటంలో పాల్గొంటున్న మాపై జరిమానాలు విధిస్తున్నారని, కరెంటు సౌకర్యం లేనప్పటికీ అంధకారంలో ఉంటూ పాములు తేల తో సహవాసం చేస్తున్నామని ప్రజలు వివరించారు. జంగంపల్లి ప్రజలు చేస్తున్న పోరాటం అభినందనీయమని అధైర్య పడద్దని మేము మీకు అండగా ఉంటామని ఎర్రజెండా ఉద్యమాలు పోరాటాలు ఎక్కడ ఓడిపోలేదన్నారు. హిట్లర్, తెల్ల దొరలు, రాజులు, రాజ్యాలను ఉదండులను ఎదిరించిన ఎర్రజెండా మీకు అండగా ఉందని, అలుపెరుగని పోరాటాలు చేయాలని ప్రభుత్వంతో మేము మాట్లాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ వెంకట్ రాములు, జిల్లా కార్యదర్శి కె చంద్రశేఖర్, కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వెంకట్ గౌడ్, కొత్త నరసింహులు, తదితరులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad