నవతెలంగాణ – గాంధారి
మండల కేంద్రంలోని వివిధ గ్రామాలకు చెందిన దివ్యాంగులు 0 నుండి 14 సంవత్సరాల దివ్యాంగులకు ప్రత్యేక నిర్ధారణ శిబిరము ఈనెల 26న జిల్లా పరిషత్ ఉన్నత (బాలుర) పాఠశాలలో జరుగును. కావున గాంధారి మండల మరియు పరిసర ప్రాంత దివ్యాంగ బాలబాలికలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా మనవి. ఈ నిర్ధారణ శిబిరంలో దివ్యాంగులకు కావలసిన ఉపకరణాలను నిర్ధారించి అందించబడును.
దివ్యాంగులు వారి వెంట తీసుకురావలసిన పత్రాలు..
1. ఆధార్ కార్డు
2. సదరం సర్టిఫికెట్
3. యు డి ఐ డి కార్డు ఉంటే
4. రేషన్ కార్డు
5. ఫోటోలు 2 తీసుకొని ఉదయం 9 గం,ల వరకు ఉన్నత పాఠశాల ప్రాంగణానికి రాగలరని మనవి. ఇట్టి సదుపాయాన్ని దివ్యాంగులైన తల్లిదండ్రులందరూ వినియోగించి వారి వారి ఉపకరణాలను పొందగలరని సూచించారు