నవతెలంగాణ – సదాశివ నగర్
మండలంలోని సబ్ స్టేషన్ కబ్జా కు గురైతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు .సబ్ స్టేషన్ స్థలం ఒక ఎకరం 20 గుంటలు ఉన్నట్లు తెలిపారు. స బ్ స్టేషన్ కు లేకపోవడంతో అందులో పశువులు మేస్తున్నట్టు తెలిపారు. కంచ ప్రహరీ గోడ లేకపోవడంతో సబ్ స్టేషన్ ఇరుప్రక్కల రైతులు సాగు చేసుకుని ఆక్రమిస్తున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. గతంలో పనిచేసిన ఏ ఈ ధర్మారెడ్డి సబ్ స్టేషన్ చుట్టూ చిన్నగా కంచ ఏర్పాటు చేశారు. మిగతా స్థలానికి ఒక ఎకరం 20 గుంటలకు కంచ గాని ప్రహరీ గోడ గాని ఏర్పాటు చేయాలని అంటున్నారు .ఇక్కడ స్థలం ప్రస్తుతం కోట్ల విలువైన స్థలం ఉన్నది 20 గుంటల భూమిని చుట్టుపక్కల రైతులు ఆక్రమించినట్టు పలువురు ఆరోపిస్తున్నారు.
ఆ యొక్క 20 గుంటల భూమిని సర్వే చేసి సబ్ స్టేషన్కు అప్పజెప్పాలని కోరుతున్నారు. ఈ సబ్ స్టేషన్ ఏర్పాటు చేసి సంవత్సరాలు గడుస్తున్న కంచకు ప్రహరీ గోడకు నోచుకోకపోవడం బాధాకరమని అంటున్నారు. సబ్ స్టేషన్ శంకుస్థాపన తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పటి కడియం శ్రీహరి మంత్రిగా ఉన్నప్పుడు ఈ సబ్ స్టేషన్ ను ప్రారంభించిన టు తెలిపారు. ఎమ్మెల్యేలు ఎంపీలు మారిన సబ్ స్టేషన్ మాత్రం కంచెకు నోచుకోకపోవడం బాదకరమని విమర్శిస్తున్నారు.. ఇప్పటికైనా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ పద్మాజి వాడి సబ్ స్టేషన్కు ప్రహరీ గోడగాని కంచెను గాని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దాంతోపాటు కబ్జా గురైన 20 గుంటల భూమిని కూడా సర్వే చేయించి సబ్ స్టేషన్కు అప్పగించాలని కోరుతున్నారు.
కబ్జాకు గురవుతున్న సబ్ స్టేషన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES