Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సమాచార విప్లవ పితామహుడు రాజీవ్ గాంధీ 

సమాచార విప్లవ పితామహుడు రాజీవ్ గాంధీ 

- Advertisement -

టీపీసీసీ అధ్యక్షులు మహేష్, మంత్రి పొన్నం..
నవతెలంగాణ – బంజారా హిల్స్

సమాచార విప్లవ పితామహుడు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన నాయకుడు భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్,మంత్రి పొన్నం ప్రభాకర్లు అన్నారు. బుధవారం సోమాజిగూడలో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సోమాజిగూడ సర్కిల్లో రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్,మంత్రి పొన్నం ప్రభాకర్లు విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.

 కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్,ఎమ్మెల్యే దానం నాగేందర్,ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్లు మెట్టు సాయికుమార్, కాల్వ సుజాత,మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ళ శారద,కార్పొరేటర్లు పి విజయ రెడ్డి,సంగీతా యాదవ్లతో పాటు ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొనీ నివాళులు అర్పించి ప్రసంగించారు. వారు మాట్లాడుతూ… దేశంలో 21 వ శతాబ్దంలో కంప్యూటర్ టెక్నాలజీ వాడుతున్నాం అంటే దానికి స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దర్శనికతకు నిదర్శనమనీ అన్నారు. వారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్న రాజీవ్ గాంధీకి ఆత్మ హనుమంతరావు వారి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు,రాజీవ్ గాంధీ బతికి ఉంటే హనుమంతన్న ఉన్నత పదవుల్లో ఉండేవారనీ ఆయనకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు.

రాజీవ్ గాంధీ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందిస్తున్న వి హనుమంతరావు టి పి సి సి అధ్యక్షులు మహేష్ కుమార్ ల,మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం చేతుల మీదుగా పంపిణీ చేశారు. రాజీవ్ గాంధీ దూరదృష్టితో హైదరాబాద్ మహా నగరం సాంకేతిక నిర్మాణం కోసం కృషి చేశారని అందులో భాగంగానే నేడు మనం వినియోగిస్తున్న  సెల్ ఫోన్లు,ఇంటర్నెట్ లాంటివి తీసుకొచ్చిందన్నారు. యువతకు 21 సంవత్సరాల వయసు నుంచి 18 సంవత్సరాలకు తగ్గిస్తూ,ఓటు హక్కు కల్పించారనీ అన్నారు.

దూరదృష్టి ఆలోచనతో సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చి ప్రపంచ దేశాలతో పోటీపడేలా అడుగులు వేశారనీ అన్నారు.పంచాయిరాజ్ చట్టాన్ని తెచ్చి,గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల బలోపేతం చేశారనీ, అనేక రకాల సంస్కరణలు తెచ్చిన రాజీవ్ గాంధీనీ గాంధీ పేరును తుడిచివేస్తామని పగటి కలలు కానే వారు వాటిని విరమించుకోవాలని హితవు పలికారు. దేశ ప్రజల్లో ముఖ్యంగా యువత హృదయంలో చిరస్థాయిగా ఉన్నారని వారు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad