- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
మండలంలోని చంద్రాయన్ పల్లి గ్రామంలో అనారోగ్యంతో మరణించిన లింగమ్మ, ముత్తయ్య, లింగయ్య కుటుంబాలను వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కరరావు బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.5000 చొప్పున ముగ్గురి కుటుంబాలకు రూ.15వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కోళ్ల సీనయ్య, కావలి సత్తయ్య, చిలేశ్వరం శీను, గడ్డమీది బాల లక్ష్మయ్య, జమ్ముల మాణిక్యం, జమ్ముల రాగయ్య, ఎర్ర గెల్వయ్య, గడ్డమీది రామస్వామి, ఎర్ర రామకృష్ణ, మల్లేష్ చంద్రాయన్ పల్లి పాల్గొన్నారు.
- Advertisement -