Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వర్షాకాలంలో విద్యుత్తుతో అప్రమత్తంగా ఉండాలి: ఏడిఈ

వర్షాకాలంలో విద్యుత్తుతో అప్రమత్తంగా ఉండాలి: ఏడిఈ

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
విద్యుత్తు పరంగానే ఏదైనా సమస్య వస్తే మా దృష్టికి తీసుకురావాలని వెంటనే సమస్యను పరిష్కరించేందుకు తక్షణమే మేము కృషి చేస్తామని కాటారం ఏడిఈ అన్నారు. ప్రజలకు రైతులకు పలు సూచనలు, సలహాలు ఇస్తూ.. కంజు మర్లు సమస్యపరంగా ఇబ్బంది పడవద్దని, ఈ వర్షాకాలంలో స్తంభాల వద్దకు గాని ఎర్త్ వైరు వద్ద గాని నిలబడవద్దని అన్నారు. వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదానికి గురికాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, సూచనలు చేశారు.

తడిసిన కరెంట్ స్థంబాలను ముట్టుకోరాదు.విద్యుత్ లైన్ కు తగులుచున్న చెట్లను ముట్టుకోరాదు.విద్యుత్ లైన్ కు చెట్టు కొమ్మలు తగిలితే సంబంధిత అధికారికి తెలియచేయవలెను. పార్కులలో గాని స్టేడియంలో గాని విద్యుత్ స్తంభాలు ముట్టుకోరాదు.ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డు లను తడి చేతులతో ముట్టుకోరాదు.బయట పెట్టిన లైట్లు నీటితో తడవకుండా చూసుకోవాలి.కరెంటు కు సంబంధించిన వస్తువులు తడి చేతులతో ముట్టుకోరాదు చిన్న పిల్లలను కరెంటు వస్తువుల వద్దకు రాకుండా చూసుకోవాలి.ఉతికిన బట్టలు ఇనుప తీగలపై వేయకూడదు.గాలి, దుమారం, వర్షం వలన తెగిన విద్యుత్ వైర్లను ముట్టుకోరాదు.ఇంట్లో ఉన్న వాటర్ హీటర్ యొక్క స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసిన తర్వాతనే నీళ్లు పెట్టిన వస్తువును ముట్టవలెను.

ఉరుములు మెరుపులతో వర్షం పడేటప్పుడు “డిష్ ” కనెక్షన్ తీసివేయవలెను. వర్షం పడుచున్నప్పుడు టీవీ, ఫ్రిడ్జ్, వాటర్ మోటర్స్ మరియు కంప్యూటర్ ల యొక్క స్విచ్ లను ఆఫ్ చేయవలెను, లేనిచో వైర్లు షార్ట్ సర్క్యూట్  అయ్యే అవకాశం ఉంటుంది. కరెంటు లైన్ క్రింద సెల్ ఫోన్ మాట్లాడకూడదు.ఇంట్లోకి వచ్చే సర్వీస్ వైర్ ఏమైన డ్యామేజ్ అయినచో సంబంధించిన అధికారి దృష్టికి తీసుకెల్లాలి.ప్రతి కరెంటు వస్తువు కు “ఎర్త్ ” తప్పనిసరిగా గా ఉండాలి. అని ఆయన తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad